AP TTC 42 Days Summer Training Course 2025 Apply Online

AP TTC 42 Days Summer Training Course 2025 Apply Online

0 Comments

TTC Summer Training Course: Applications are invited for the 42-day TTC Summer Training. The training will be conducted in Visakhapatnam, Kakinada, Guntur, Kadapa and Anantapur from 01/05/2025 to 11/06/2025. Online applications will be open from 03/04/2025 to 25/04/2025 on the website of the Board of Government Examinations (www.bse.ap.gov.in).

42 రోజుల వేసవి TTC శిక్షణా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తీ వివరాలు ఈ పోస్టులో అందించడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కోర్సు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప మరియు అనంతపురంలలో 01-05-2025 నుండి 11-06-2025 వరకు జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు 03-04-2025 నుండి 25-04-2025 వరకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 25-04-2025. ఆన్‌లైన్ దరఖాస్తు ముగిసిన తర్వాత ఎటువంటి దరఖాస్తులు అంగీకరించబడవు మరియు ఆఫ్‌లైన్ దరఖాస్తులు అంగీకరించబడవు.01-05-2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన మరియు 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మరియు క్రింద పేర్కొన్న ఏవైనా అర్హతలు కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

TTC Summer Training Course విద్యార్హతలు:

  • 10 వ తరగతి పాస్ అయ్యి TCC లోయర్ పూర్తి చేసి ఉండాలి.
    SSC ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • Board of Intermediate Education, AP జారీ చేసిన vocational పాస్ certificate కలిగి ఉండాలి.
  • State Board of Technical & Training (S.B.T.Ε.Τ), Α.Ρ వారు జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన I. T. I ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • Industries మరియు Commerce డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • తెలుగు విశ్వ విద్యాలయం వారు జారీ చేసిన కర్నాటిక్ మ్యూజిక్ (వోకల్ లేదా వీణ లేదా వయొలిన్) లలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • ఏదైనా విశ్వ విద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

కావున ఈ కోర్సుకు అప్లై చేసుకొనదలచిన విద్యార్ధులు 25-04-2025 లోపు అప్లై చేసుకొసి కోర్సు కేంద్రం ఏ జిల్లా ఎంపిక చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ ప్రింట్ తో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేసి 01-05-2025 నుండి తరగతులకు హాజరు కావలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.

Press Note – TTC 42 Days Training Online Application – 2025

Read More: All Govt Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts